
అక్షరటుడే, న్యూఢిల్లీ: H-1B visa fee increased | రోజుకో సంచలన నిర్ణయం ప్రకటన అన్నట్లుగా మారింది యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు.
తాజాగా అమెరికాలోని విదేశీయులపై ట్రంప్ మరో పిడుగు వేశారు. H-1B VISA వీసా కొత్త నిబంధనలను ప్రకటించారు. H-1B వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా 100,000 డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు)కు పెంచారు.
ఇప్పటివరకు ఈ H-1B వీసా దరఖాస్తు ఫీజు కేవలం రూ. 1 – 6 లక్షల మధ్య ఉండేది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలోని విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు ఇబ్బంది పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కాగా, H-1B వీసాను మూడేళ్లకోసారి రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిన్యూవల్ ఫీజును కూడా లక్ష డాలర్లకు పెంచినట్లు తెలుస్తోంది.
వాషింగ్టన్ డీసీ Washingtonలో ఉన్న DC వైట్ హౌస్ White House లోని ఓవల్ కార్యాలయంలో శనివారం (సెప్టెంబరు 20) ట్రంప్ ఈ కొత్త ఆర్డర్స్‌పై సంతకం చేశారు.
ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాలోని లక్షలాది మంది విదేశీయులపై తీవ్ర ప్రభావం పడబోతోంది.
ముఖ్యంగా H-1B వీసాపై ఎక్కువగా డిపెండ్ అయిన ఇండియన్స్ ఐటీ, టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది.
ఒకవేళ వీసా రిన్యూవల్ ఫీజు సైతం భారీగా పెంచితే అమెరికాలోని భారతీయులు పునరాలోచనలో పడకతప్పదు.
రిన్యూవల్ ఫీజు కూడా పెంచినట్లు ప్రచారంలో ఉండటంతో.. తాము పెట్టాబేడా సర్దుకొని భారత్‌కు వచ్చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అక్కడి ఎన్ఆర్ఐలు చెబుతున్నారు.
H-1B visa fee increased | ఆనాడు అవసరం కోసం..
1990లో H-1B వీసా ప్రారంభమైంది. యూఎస్‌లో మ్యాన్‌పవర్ సమస్య ఉన్న రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీనిని తీసుకొచ్చారు. కాగా, కాలక్రమేణా పలు కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ ప్రధాన ఆరోపణ.
ఇక యూఎస్ మంజూరు చేస్తున్న H-1B వీసాలలో 2015 నుంచి అంటే గత పదేళ్ల నుంచి 70 శాతం కంటే ఎక్కువ భారతీయులే పొందుతున్నారు.
ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు ఏటా వేలాది మంది ఉద్యోగులను యూఎస్‌కు పంపుతున్నాయి.
తాజా వీసా ఫీజు పెంపుతో ఒక్కో ఉద్యోగి కోసం సుమారు రూ. కోటి వరకు ఖర్చు చేయడమంటే.. ఆ స్థాయిలో కంపెనీలు కూడా సాహసించకపోవచ్చు.
వీసా ఫీజు పెంపుతో భారత్ ఇంజినీర్లకు అమెరికా అవకాశాలు తగ్గబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.