అక్షరటుడే, ఇందూరు: Gymnastic Association | జిమ్నాస్టిక్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ హాజరయ్యారు.
ఎలక్షన్స్ ఆఫీసర్‌గా గోపిరెడ్డి, రాష్ట్ర అబ్జర్వర్ ముస్తఫా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) అబ్జర్వర్‌గా భూమారెడ్డి, జిల్లా యువజన, క్రీడా అథారిటీ అబ్జర్వర్‌గా (Youth and Sports Authority Observer) ఆర్చరీ కోచ్ మురళి వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా ఏలేటి కిరణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ స్వామి కుమార్, కోశాధికారిగా చంద్ర శేఖర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్, హర్దీప్, విజయ్, వేణు రాజ్, జాయింట్ సెక్రటరీలు గా బుచ్చన్న, సురేష్ రెడ్డి, ప్రవీణ్, దేవేందర్, ఈసీ మెంబర్స్‌గా రాజేశ్వర్, మురళి, ప్రకాష్, సంధ్య, రాకేష్, రాజ్ కుమార్, మణి తేజ, శ్రీకాంత్ ఎన్నికయ్యారు.