అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Noida | ప్రస్తుతం కాలంలో ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి పెరుగుతుండటంతో జిమ్‌లు అన్నిచోట్లా రద్దీగా మారాయి. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వర్కౌట్ చేయడానికి వచ్చిన వారు మెషీన్ల చుట్టూ క్యూలు కడుతున్నారు. ఒకరి వంతు అయిపోగా మరొకరు జిమ్(Gym) చేసే క్రమంలో పోటీ పడుతున్నారు.
ఆ సమయంలో కాస్త ఆలస్యం అయితే చికాకులు, వాగ్వివాదాలు జరగడం సాధారణం అయ్యాయి. అయితే తాజాగా నోయిడా(Noida)లోని ఒక జిమ్‌లో జరిగిన సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెషీన్ వాడుకునే క్రమంలో ఇద్దరు మహిళలు ఘర్షణకు దిగారు. చివరికి ఆ గొడవ చెలరేగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Noida | డిష్యూం డిష్యూం..
వీడియోలో ఒక మహిళ మెషీన్‌పై వర్కౌట్ చేస్తుండగా, మరో మహిళ ఆమె దగ్గరకు వెళ్లి తను వర్కవుట్ చేస్తానని వాదనకి దిగింది. కొద్ది సేపటికే మాటామాట పెరిగి శారీరకంగా ఘర్షణకు దారి తీసింది. ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని లాగిపడేశారు. జిమ్ వాతావరణం(Gym Atmosphere) కాసేపట్లో రెజ్లింగ్ ఏరియగా మారిపోయింది. దాదాపు రెండు నిమిషాల పాటు కొనసాగిన ఈ ఘర్షణను ఆపడానికి ఇతర మహిళలు రంగంలోకి దిగి వారిని కష్టపడి విడదీశారు.ఇక ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఎవరో ఆ ఫుటేజ్‌ను క్లిప్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాసేపట్లోనే వైరల్ అయింది.
నెటిజన్లు ఈ ఘటనపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “జిమ్ అనేది ఫిట్‌నెస్ కోసం వెళ్ళే స్థలం.. ఇలాంటి గొడవలకు కాదు” అంటూ విమర్శిస్తుండగా, మరికొందరు “మెషీన్ కోసం ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది” అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సంఘటనతో జిమ్ మేనేజ్‌మెంట్(Gym Management) కూడా అప్రమత్తమై, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా వంతుల విషయంలో కట్టుదిట్టం చేయాలని నిర్ణయించిందని సమాచారం.మొత్తం మీద, జిమ్‌లో మెషీన్ వాడకంపై ఏర్పడిన చిన్న వివాదం పెద్ద గొడవగా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Kalesh b/w Females over using Smith machine for doing squats, Female only gym in Noida UP. pic.twitter.com/R3WDFZBqUc
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 29, 2025