ePaper
More
    HomeతెలంగాణSecunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్(Gym coach)​ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లో చోటు చేసుకుంది. రీసాల్​బజార్‌(Risal Bazaar)లో నివాసం ఉండే జ్ఞానేశ్వర్​ జిమ్​ కోచ్​గా పనిచేస్తున్నాడు. ఆయన ఆదివారం సాయంత్రం బిర్యానీ తిన్నాడు. అనంతరం ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉండే ఆర్​ఎంపీ క్లినిక్‌కు వెళ్లాడు. అయితే గ్యాస్ట్రిక్‌ సమస్య(Gastric problem) అని చెప్పి సదరు ఆర్​ఎంపీ ఇంజెక్షన్‌ ఇచ్చి పంపించాడు.

    క్లినిక్‌ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటికే జ్ఞానేశ్వర్‌ కుప్పకూలాడు. వెంటనే కంటోన్మెంట్​ ఆస్పత్రికి (Cantonment Hospital) తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో క్లినిక్‌ వద్ద జ్ఞానేశ్వర్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతోనే(RMP Negligence) మృతి చెందాడని ఆరోపించారు. ఈ మేరకు సదరు ఆర్​ఎంపీని బొల్లారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...