Gutta Sukhender Reddy
Gutta Sukhender Reddy | క‌విత రాజీనామాపై గుత్తా కీల‌క వ్యాఖ్య‌లు.. పున‌రాలోచించుకోవాల‌ని చెప్పిన‌ట్లు వెల్ల‌డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gutta Sukhender Reddy | తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత రాజీనామాపై శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి(Gutta Sukhender Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న‌ల్గొండ‌లో గురువారం త‌న‌ను క‌లిసిన విలేక‌రుల‌తో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయ‌న క‌విత రాజీనామా(Kavitha Resignation)పై స్పందించారు.

ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ క‌విత పంపిన లేఖ అందింద‌ని చెప్పారు. అయితే, ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. క‌విత త‌న‌కు ఫోన్ చేసి రాజీనామా విష‌యాన్ని చెప్పార‌ని, ఆమోదించాల‌ని కోరార‌ని తెలిపారు. అయితే, ఎమోష‌న‌ల్‌గా రాజీనామా చేశార‌ని, దీనిపై పున‌రాలోచించుకోవాల‌ని వెల్ల‌డించారు. రాజీనామాపై స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు.

Gutta Sukhender Reddy | బీఆర్ఎస్ స‌స్పెండ్ చేయ‌డంతో..

బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి స‌స్పెండ్ చేయ‌డంతో క‌విత సెప్టెంబ‌ర్ 3న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్(KCR) తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో.. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు దుష్టచతుష్టయం ఏదో ప్రచారం చేస్తుందంటూ కవిత మండిపడ్డారు.

తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆరడుగు బుల్లెట్ ఈ రోజు తనను గాయపరిచిందన్నారు. హ‌రీశ్‌రావు(Harish Rao), సంతోష్ రావు.. చేసిన పనులతో కేసీఆర్‌, కేటీఆర్‌(KTR)కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. హరీష్, సంతోష్(Santosh Rao) మూఠాలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయన్నారు. హరీశ్‌రావును పక్కన పెట్టుకుని.. నిజాలు మాట్లాడిన తనను బయటకు పంపారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.