అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gutta Jwala | పెళ్లి తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది. తల్లి పాలు (Mother Milk) బిడ్డకు ప్రథమ ఆహారం, అమృతం అని వైద్యులు చెబుతుంటారు. అయితే, కొంత మంది మహిళల్లో హార్మోనల్ సమస్యలు లేదా శరీర సంబంధిత కారణాల వల్ల తల్లిపాలు సరిపడా ఉత్పత్తి కావు.
అటువంటి సందర్భాల్లో పాల కోసం ఇతర మార్గాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ లోటును భర్తీ చేసేలా కొందరు తల్లులు స్వచ్ఛందంగా తమ పాలను దానం చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల (Indian badminton star Gutta Jwala) కూడా చేరింది. ఇటీవల తల్లి అయిన ఆమె చేసిన సేవా కార్యక్రమం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రశంసలు అందుకుంటోంది.
Gutta Jwala | ప్రశంసల వర్షం..
నివేదికల ప్రకారం, గుత్తా జ్వాల (Gutta Jwala) తన బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి (government hospital) పంపిస్తున్నారు. రోజుకు సగటున 600 మిల్లీలీటర్లు దానం చేస్తూ, గత నాలుగు నెలల్లో దాదాపు 30 లీటర్ల తల్లిపాలు అవసరమైన నవజాత శిశువులకు అందించారు. తల్లిపాలు అందని పిల్లలకు తన పాల వల్ల ప్రాణాధారంగా మారుతుందని భావించి ఎంతో భావోద్వేగానికి గురైనట్లు ఆమె తెలిపింది. గుత్తా జ్వాల 2021లో నటుడు విష్ణు విశాల్‌ను (actor Vishnu Vishal) వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి అయిన ఆమె తన పాలిచ్చిన తర్వాత మిగిలిన పాలను నిరంతరం దానం చేస్తున్నారు.
తల్లి పాలను దానం చేయడంలో గుత్తా జ్వాల చూపిన ఈ ఉదారత నిజంగా స్ఫూర్తిదాయకమని అభిమానులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం చాలా మంది తల్లులు శరీరాకృతిలో మార్పుల భయంతో పిల్లలకు పాలు ఇవ్వడానికి వెనుకాడుతున్న వేళ, జ్వాలా గుత్తా చేసిన ఈ సేవ మరింత గొప్పదనంగా ప్రశంసిస్తున్నారు. తల్లిపాలు బిడ్డలకు అమృతం లాంటివి అని వైద్యులు (Doctors) చెబుతుంటారు. అలాంటి అమృతాన్ని దానం చేస్తూ గుత్తా జ్వాల నిజమైన అమ్మతనానికి నిర్వచనంగా నిలుస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.