HomeతెలంగాణGurukul School | అద్దె చెల్లించలేదని గురుకుల పాఠశాలకు తాళం

Gurukul School | అద్దె చెల్లించలేదని గురుకుల పాఠశాలకు తాళం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gurukul School | అద్దె చెల్లించలేదని గురుకుల పాఠశాల(Gurukul School)కు భవన యజమాని(Building owner) తాళం వేశాడు. వేసవి సెలవుల అనంతరం బడికి వెళ్లిన ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తాళం వేసి ఉండడంతో షాక్​ అయ్యారు. ఈ ఘటన హైదరాబాద్​లోని బాగ్​ లింగంపల్లి(Bagh Lingampalli)లో చోటు చేసుకుంది.

బాగ్‌లింగంపల్లిలోని ఓ ప్రైవేటు భవనంలో బాలికల గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. అయితే 13 నెలలుగా అద్దె(Rent) బకాయిలు చెల్లించలేదు. దీంతో గురువారం పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా భవన యజమాని తాళం వేసుకొని వెళ్లాడు. దీంతో ఉపాధ్యాయులు(Teachers), విద్యార్థులు(students) పాఠశాల బయటే ఉండిపోయారు. సంబంధిత భవన యజమానితో అధికారులు మాట్లాడుతున్నట్లు సమాచారం.