Gurugram live-in attack | పెళ్లి చేసుకోమ‌న్నందుకు దారుణం.. యువతిపై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gurugram live-in attack | హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న యువతిపై యువకుడు అమానుషంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. త్రిపుర (Tripura)కు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్‌లో బయోటెక్నాలజీ విద్యను అభ్యసిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీ (Delhi)కి చెందిన 19 ఏళ్ల శివం అనే యువకుడితో ఆమెకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gurugram live-in attack | హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న యువతిపై యువకుడు అమానుషంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది.

త్రిపుర (Tripura)కు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్‌లో బయోటెక్నాలజీ విద్యను అభ్యసిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీ (Delhi)కి చెందిన 19 ఏళ్ల శివం అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరూ కలిసి గురుగ్రామ్ సెక్టార్-69లోని ఒక ఫ్లాట్‌లో సహజీవనం ప్రారంభించారు.

Gurugram live-in attack | పెళ్లి మాటే కలహానికి కారణం

ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యువతి పెళ్లి గురించి పట్టుబడడంతో ఆగ్రహానికి గురైన శివం, ఆమెను గదిలో బంధించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మెటల్ బాటిల్‌తో తలపై దాడి చేసి, ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తరువాత కత్తితో కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. మూడు రోజుల పాటు ఆమెను గదిలోనే నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశాడని పోలీసులు వెల్లడించారు.

తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించిన యువతి తన తల్లికి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి (Safdarjung Hospital)కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు శివంను అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, అత్యాచారం, అక్రమ నిర్బంధం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత మరిన్ని కఠిన సెక్షన్లు చేర్చే అవకాశముందని గురుగ్రామ్ డీసీపీ తెలిపారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ...

Harish Rao Criticizes Revanth | సీఎం చేసిందేమి లేదు.. కూల్చిందే ఎక్కువ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రెండేళ్ల...

RTC Bus Accident Mendora | ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

అక్షరటుడే, మెండోరా : RTC Bus Accident Mendora | ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ...