Homeఆంధప్రదేశ్Guntur Commissioner | ఆ ప్రాంతాల‌లో టిఫిన్ బండ్లు, పానీపూరీ అమ్మకాలు నిషేధం.. ఆదేశాలు జారీ...

Guntur Commissioner | ఆ ప్రాంతాల‌లో టిఫిన్ బండ్లు, పానీపూరీ అమ్మకాలు నిషేధం.. ఆదేశాలు జారీ చేసిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guntur Commissioner | గుంటూరు నగరంలో డయేరియా కేసులు (Diarrhea Cases) గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో నగర పాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాధి మరింత విస్తరించకుండా అడ్డుకునేందుకు నగర కమిషనర్ (Guntur Commissioner) పులి శ్రీనివాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా టిఫిన్ బండ్లు, పానీపూరీ వంటి రోడ్‌సైడ్ ఆహార విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

Guntur Commissioner | తాత్కాలిక నిషేధం..

ప్రజలు ఎక్కువగా నివసించే ప్రగతి నగర్ (Pragathi Nagar), రామిరెడ్డి తోట, రెడ్ల బజార్, సంగడిగుంట తదితర 9 ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దీంతో నగర కమిషనర్ పరిస్థితిని సమీక్షిస్తూ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

వైద్య నిపుణుల అభిప్రాయం మేరకు, కలుషిత ఆహారం మరియు నీరు డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమవుతున్నాయని గుర్తించి, ముందస్తు జాగ్రత్త చర్యగా పానీపూరీ బండ్లు, టిఫిన్ సెంటర్ల (Tiffin Centers) కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని కమిషనర్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చర్యలతో వ్యాధిని త్వరగా అదుపులోకి తెచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి హైజీనికల్ ఫుడ్‌నే ఉపయోగించాలని, అనుమానాస్పద నీటి వనరులను నివారించాలని సూచించారు.

Must Read
Related News