అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. నగరంలోని చాదర్‌ఘాట్‌లో ఇద్దరు సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో కానిస్టేబుల్‌పై దొంగ కత్తితో దాడికి యత్నించాడు. దీంతో సౌత్ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ తన గన్‌మెన్ నుంచి వెపన్ తీసుకుని దొంగపై కాల్పులు జరిపారు. దొంగలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇద్దరు దొంగల్లో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా.. డీసీపీతో పాటు మిగతా వారు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఇటీవల నిజామాబాద్ నగరంలో ఓ రౌడీషీటర్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు నిందితుడిని పట్టుకుని ఆస్పత్రికి తరలించగా.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులపై మరోసారి దాడి చేసేందుకు యత్నించగా ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందిన విషయం విదితమే.
