Homeజిల్లాలుహైదరాబాద్Hyderabad | హైదరాబాద్​లో కాల్పుల కలకలం

Hyderabad | హైదరాబాద్​లో కాల్పుల కలకలం

Hyderabad | మేడ్చల్​ జిల్లా పోచారంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. మేడ్చల్​ (Medchal) జిల్లా పోచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోచారంలో ప్రశాంత్​ సింగ్​ సోనూ అనే వ్యక్తిపై నిందితుడు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఇబ్రహీంగా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. గాయపడ్డ ప్రశాంత్​ సింగ్​ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కాల్పులు ఎందుకు జరిపాడనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

కాగా హైదరాబాద్​ నగరంలో ఇటీవల నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు డ్రగ్స్​ దందా సాగుతుండగా.. హత్యలు సైతం పెరిగిపోయాయి. గతంలో దోపిడీ దొంగలు గన్​లతో బెదిరించి చందానగర్​లో ఓ బంగారం దుకాణంలో చోరీ చేశారు. ఇటీవల మెట్రో స్టేషన్​లో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్​ దొరకడం కలకలం రేపింది. తాజాగా పోచారంలో కాల్పులు చోటు చేసుకోవడంతో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గన్​ కల్చర్​ పెరుగుతుండటంపై కలవర పడుతున్నారు.