Homeక్రైంKhajana Jewellers | చందానగర్​లో కాల్పుల కలకలం.. ఖజానా జ్యువెలర్స్​లో దోపిడీకి యత్నం

Khajana Jewellers | చందానగర్​లో కాల్పుల కలకలం.. ఖజానా జ్యువెలర్స్​లో దోపిడీకి యత్నం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khajana Jewellers | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం నగల దుకాణంలో దోపిడీకి యత్నించారు. ఈ ఘటన చందానగర్​లో గల ఖజానా జ్యువెలర్స్ (Khajana Jewellers)​ షో రూమ్​లో చోటుచేసుకుంది.

ఖజానా జ్యువెలరీ షాప్‌ను సిబ్బంది రోజు మాదిరిగా మంగళవారం ఉదయం ఓపెన్​ చేశారు. దుకాణం తెరిచిన ఐదు నిమిషాలకే దొంగలు చొరబడ్డారు. ఆరుగురు దుండగులు షాప్​లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై రెండు రౌండ్ల కాల్పులు (Gun Fire) జరిపారు. ఈ ఘటనలో డిప్యూటీ మేనేజర్​ గాయపడ్డారు. దొంగలు సీసీ కెమెరాను సైతం తుపాకీతో కాల్చి వేశారు.

Khajana Jewellers | పది బృందాలతో గాలింపు

దొంగలు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరించారు. నిందితులను పట్టుకోవడానికి పది బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలు జహిరాబాద్ వైపు పారిపోయినట్లు తెలిసింది. దీంతో జిల్లాల సరిహద్దులను సైతం పోలీసులు అప్రమత్తం చేశారు. ఉదయం పూటే దొంగలు కాల్పులు జరపడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.