అక్షరటుడే, మెదక్ : Medak | భూ వివాదం నేపథ్యంలో తుపాకీతో బెదిరింపులకు పాల్పడేందుకు యత్నించిన ఘటన మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఎల్లంకు, హైదరాబాద్ (Hyderabad)కు చెందిన వ్యక్తితో కొంతకాలంగా భూ వివాదం ఉంది.
భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి ఎల్లం ఇంజెక్షన్ ఆర్డర్ (Injection Order) తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం పంట కోయడానికి వెళ్లాడు. అయితే హైదరాబాద్కు చెందిన వ్యక్తి అనుచరులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ నాగ్పూర్ (Nagpur) గ్రామానికి చెందిన వ్యక్తి గన్తో ఉండటం కలకలం రేపింది. సదరు వ్యక్తిని అనుమానంతో తనిఖీ చేస్తే తుపాకీ లభించింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Medak | డమ్మీ గన్..
హవేలి ఘన్పూర్ పోలీసులు (Ghanpur Police) ఘటన స్థలానికి చేరుకొని గన్ స్వాధీనం చేసుకున్నారు. దానిని పరిశీలించగా.. డమ్మీ గన్ (Dummy Gun) అని తేలింది. అయితే డమ్మీ గన్తో బెదిరింపులకు పాల్పడేందుకు సదరు వ్యక్తి యత్నించాడని పోలీసులు తెలిపారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వివాదంలో ఇరువురి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయి. దీంతో తనను చంపుతానని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
