అక్షరటుడే, హైదరాబాద్: Gun Firing | తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాల్పుల ఘటనలు తెలంగాణ ప్రజలను కలవరపెడుతున్నాయి.
వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో వరుసగా మూడు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, వీటిలో రెండు నిందితులపై పోలీసులు జరిపిన కాల్పులు, ఒకటి గోరక్షకుడిపై నిందితుడు జరిపిన కాల్పులు కావడం గమనార్హం.
Gun Firing | వరుస ఘటనలు..
నిజామాబాద్ Nizamabad జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హతమార్చి, తప్పించుకునే క్రమంలో నిందితుడు ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. కానిస్టేబుల్‌ను చంపి పారిపోయిన పాత నేరస్థుడు రియాజ్.. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో పోలీసులకు తిరగబడి బుల్లెట్ తూటాలకు నేలకొరిగాడు.
గత సోమవారం (అక్టోబరు 21) అంటే పండుగ రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంతో నరకాసుర వధ జరిగిందని ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
మేడ్చల్ జిల్లా (Medchal district) ఘట్‌కేసర్ మండలం పోచారం వద్ద అక్టోబరు 22వ తేదీన గోరక్షక్ కార్యకర్త సింగ్ సోనూ(ప్రశాంత్)పై కాల్పులు జరిగాయి.
ఘట్‌కేసర్ Ghatkesar పరిధిలోగోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సోనూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న నిందితుడు ఇబ్రహీం తుపాకీతో సోనూపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఇబ్రహీంకు ఎంఐఎం నాయకులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
తాజాగా, శనివారం (అక్టోబరు 25) మరో ఘటన జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో (Chadar Ghat, Hyderabad) కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.
చాదర్ ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. రౌడీ షీటర్, దొంగ అయిన Mohammed Umar Ansari ను డీసీపీ చైతన్య DCP Chaitanya పట్టుకునే ప్రయత్నం చేయగా.. నిందితుడు డీసీపీ సిబ్బందిపై కత్తితో దాడికి దిగాడు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ నిందితుడిపై కాల్పులు జరిపారు.
Gun Firing | మరో ఎన్కౌంటర్ తప్పదా..!
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ (constable Pramod) ను హతమార్చిన నిందితుడు రియాజ్‌ను పోలీసులు కాల్పి చంపారు. తాజాగా, జీహెచ్ఎంసీ GHMC పరిధిలో డీసీపీపైనే ఓ నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో మరో ఎన్కౌంటర్ తప్పదనే ప్రచారం జరుగుతోంది.
