ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistani migrants | పాకిస్తానీ వలసదారులపై గల్ఫ్ దేశాల కఠిన వైఖరి.. వేలాదిమందిని తిరస్కరిస్తున్న సౌదీ,...

    Pakistani migrants | పాకిస్తానీ వలసదారులపై గల్ఫ్ దేశాల కఠిన వైఖరి.. వేలాదిమందిని తిరస్కరిస్తున్న సౌదీ, ఇరాన్, ఇరాక్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistani migrants : పాకిస్తాన్‌ నుంచి గల్ఫ్ దేశాల(Gulf countries)కు అక్రమంగా వలస వెళ్లేవారిపై.. హజ్, ఉమ్రా పర్యాటకులుగా వెళ్లే వారిపై మధ్యప్రాచ్య దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఇరాన్(Iran), ఇరాక్(Iraq), సౌదీ అరేబియా(Saudi Arabia) కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అక్రమంగా ప్రవేశించిన, అసభ్యకర ప్రవర్తన కలిగిన వేలాది మంది పాకిస్తానీలను ఈ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి.

    Pakistani migrants : 34,000 మంది పాకిస్తానీలను వెనక్కి పంపించిన ఇరాన్

    దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన కారణంగా ఇరాన్‌ సర్కారు ఇటీవల 34,000 మంది పాకిస్తానీలను డిపోర్ట్ చేసింది. అక్రమ మార్గాల ద్వారా వలస వెళ్తున్న వ్యక్తులను పట్టుకుని, మదా చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఇరాన్‌ అధికారులు వెల్లడించారు.

    Pakistani migrants : ఇరాక్‌లోనూ 50,000 మందికి తిరస్కరణ

    ఇరాక్‌ సైనిక, భద్రతా యంత్రాంగాలు హజ్(Hajj), జియారత్‌(Ziarat)ల కోసం వచ్చి.. అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ 50,000 మంది పాకిస్తానీలను వెల్లగొట్టింది. వీరిలో చాలామంది వీసా పరిమితుల(visa restrictions)ను ఉల్లంఘించడంతో పాటు పలు వివాదాస్పద చర్యలకు పాల్పడ్డట్లు తెలిసింది.

    Pakistani migrants : సౌదీ అరేబియాలోనూ..

    సౌదీ అరేబియా కూడా పాక్‌కు ఆగ్రహంతో కూడిన హెచ్చరిక జారీ చేసింది. “పిల్లల్ని, పిక్పాకెట్లను, ముసలి బిచ్చగాళ్లను హజ్ యాత్రికుల పేరిట పంపించొద్దు” అని పాక్ ప్రభుత్వానికి సౌదీ అధికారులు అధికారికంగా సూచించారు.

    ఇటీవల సౌదీ దేశంలో పలువురు పాకిస్తానీలు బిచ్చగాళ్లుగా, దొంగతనాలకు పాల్పడుతున్నవారిగా సీసీటీవీ ఆధారాలు లభించాయి.

    Pakistani migrants : అంతర్జాతీయంగా పాక్‌ ఇమేజ్‌కు గండం

    గల్ఫ్ దేశాల ఉద్యోగ మార్కెట్లలో పాకిస్తానీయులకు అవకాశాలు భారీగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం వలస విధానాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాకిస్తానీయుల అక్రమ వలసలు, అసభ్య ప్రవర్తన, పని చేసే చోట మోసాలు వంటి ఘటనలుజ.. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి.

    దీనిపై పాక్ ప్రభుత్వం(Pakistani government) స్పందించకపోతే, రాబోయే కాలంలో ప్రవాస వనరులపై పాక్​నకు తీవ్రమైన దెబ్బ తగలక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...