Homeతాజావార్తలుHyderabad | హైదరాబాద్​లో గుజరాత్​ పోలీసుల సోదాలు.. టెర్రరిస్ట్ సయ్యద్ ఇంట్లో పలు వస్తువులు సీజ్

Hyderabad | హైదరాబాద్​లో గుజరాత్​ పోలీసుల సోదాలు.. టెర్రరిస్ట్ సయ్యద్ ఇంట్లో పలు వస్తువులు సీజ్

ఇటీవల అరెస్టయిన ఉగ్రవాది సయ్యద్​ మొహియుద్దీన్ ఇంట్లో గుజరాత్​ పోలీసులు సోదాలు చేపట్టారు. రాజేంద్ర నగర్​లోని అతడి ఇంట్లో పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్​లో (Rajendranagar)​గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​ (ATS ) పోలీసులు అర్ధరాత్రి సోదాలు చేశారు. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్​ సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

ఉగ్రవాద ఆరోపణలతో డాక్టర్​ సయ్యద్​ను గుజరాత్​ పోలీసులు (Gujarat Police) ఇదివరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రమాకర విషం రెసిన్​ తయారు చేసి సామూహిక హత్యలకు సయ్యద్​ కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈక్రమంలో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, ఐదుగురు సభ్యుల బృందం మంగళవారం అర్ధరాత్రి అతడి ఇంట్లో సోదాలు చేపట్టింది.

Hyderabad | సామగ్రి సీజ్​

సయ్యద్ ఇంట్లో మూడు రకాల లిక్విడ్‌తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారుచేసే మిషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను సైతం గుర్తించారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి తనిఖీలు చేపట్టారు. ఆ సామగ్రిని సీజ్​ చేసి గుజరాత్​ తీసుకెళ్లారు. అయితే సోదాలపై ఒమర్ ఫారూఖీ మాట్లాడారు. తమ ఇంట్లో మంగళవారం రాత్రి గుజరాత్​ పోలీసులు సోదాలు చేపట్టారని చెప్పారు. మరోసారి దాడులు చేశారనేది అవాస్తవం అన్నారు. రాజేంద్రనగర్​లోని పిల్లర్ నంబర్ 122 వద్ద తమ మొహయోద్దీన్ హోటల్ గెలాక్సీ‌ (Hotel Galaxy)లో షవర్మ బిజినెస్ చేశాడు. దీంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేపట్టారని ఫారుఖీ తెలిపారు.

Must Read
Related News