అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్ (Guinness Book) రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరూర్ నగర్ స్టేడియం (Saroor Nagar Stadium)లో సోమవారం మహా బతుకమ్మ సంబురాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
సరూర్ నగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. 66.5 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో పది వేల మంది మహిళలు పాల్గొన్నారు. దీంతో రెండు గిన్నిస్ రికార్డులు సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా బతుకమ్మ వేడుకలు గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించాయి. అలాగే 66.5 అడుగుల ఎత్తైన పెద్ద బతుకమ్మ చుట్టూ ఒకేసారి 1,354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. ఇది మరో రికార్డు సాధించింది.
CM Revanth Reddy | సీఎంను కలిసిన మంత్రి
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డులను ఆయనకు అందించారు. దీంతో ఆయన పర్యాటక శాఖ అధికారులను అభినందించారు.