అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పోలీసు సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సీపీ కార్యాలయంలో (CP Office) శనివారం కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు (Court Duty Officers) ఈ-సమన్స్పై శిక్షణ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు.
CP Sai Chaitanya | సమయానుకూలంగా ఈ-సమన్స్ జారీ చేయాలి
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ–సమన్స్ జారీ చేయాలని సూచించారు. పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను (Digital platform) వాడడంలో శిక్షణ తీసుకుని, ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు. సంబంధిత అన్ని కోర్టుల నుండి జారీ అయ్యే సమన్స్‌ను పోలీస్స్టేషన్ల వారీగా డౌన్లోడ్ చేసుకుని త్వరితగతిన వాటిని సంబంధీకులకు అందజేయాలని సూచించారు.
CP Sai Chaitanya | ఎస్‌హెచ్‌వోలకు వివరించాలి
ఈ శిక్షణను సిబ్బంది సద్వినియోగపర్చుకున్న అనంతరం వారు సంబంధిత పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు శిక్షణ గురించి క్లుప్తంగా వివరించాలన్నారు. ఈ శిక్షణలో డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి (DCP Baswareddy), సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సతీష్ (CCRB Inspector Satish), కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్ డ్యూటీ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.