అక్షరటుడే ఇందూరు: Guest lecturers | అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Giriraj Government Degree College) అతిధి అధ్యాపకులు కోరారు. రాష్ట్ర రైతు కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్‌కు (Gadugu Gangadhar) గురువారం జిల్లా కేంద్రంలో వినతిపత్రం అందజేశారు.
Guest lecturers | ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్లాసుల వారి విధానం వల్ల తాము నష్టపోతున్నామని, ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలని అతిధి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని గడుగు గంగాధర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో గిరిరాజ్ కళాశాల అతిథి అధ్యాపకుల ప్రతినిధులు సంతోష్ కుమార్, చంద్రిక, గంగాధర్, రాజేశ్వర్, వసంత్ కుమార్, సతీష్, రాధిక, సమంత, వాని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.