అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gudem Mahipal Reddy Return | పటాన్చెరు ఎమ్మెల్యే (Patancheru MLA) గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. ఆయన తిరిగి గులాబీ గూటికి చేరనున్నారు.
గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ (BRS) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన నాటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. తన పనులు చేయడం లేదని, నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని పలు వేదికలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో మన్సిపల్ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని సూచించారు.
Gudem Mahipal Reddy Return | ఐదు మున్సిపాలిటీల్లో..
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ (Congress) హవా కొనసాగింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందడం గమనార్హం. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నింటా బీఆర్ఎస్ గెలుపు కోసం శ్రమించారు. కనీసం ఒక్క మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకోలేకపోయింది. గుమ్మడిదల, గడ్డపోతారం (Gadda Potharam), ఇంద్రేశం, ఇస్నాపూర్‌లో బీఆర్ఎస్ విజయం సాధించింది. జిన్నారంలలో సైతం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఘర్ వాపసీ కోసమే బీఆర్ఎస్ని ఆయన గెలిపించినట్లు సమాచారం. త్వరలో కేసీఆర్ సమక్షంలో గూడెం మళ్లీ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది.
Gudem Mahipal Reddy Return | బీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్
గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో మరో వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మున్సిపాలిటీలోని 5వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ శిల్ప నాగరాజును గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. దీంతో జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల బలం 10కి పెరిగింది. కాంగ్రెస్ 6, బీజేపీకి నలుగురు సభ్యులు ఉండడంతో మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కాగా అధికార కాంగ్రెస్‌లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి వెళ్లిపోవడం ఆ పార్టీకి షాక్ అని చెప్పాలి.