అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్(IPL 2025 Eliminator match)లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) బ్యాటింగ్లో చెలరేగి ఆడి విజయం సొంతం చేసుకుంది. శుక్రవారం (మే 30) గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్లో దుమ్ములేపి భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్ మొదటి నుంచే దూకుడు ప్రదర్శించింది.
ముంబయి జట్టు నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ముంబయి జట్టు క్వాలిఫయర్ – 2 గా నిలిచింది.
ఓపెనర్ రోహిత్ శర్మ Rohit Sharma(50 బంతుల్లో 81:9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ, టాప్ స్కోర్(81) చేశాడు. సూర్య కుమార్ యాదవ్(33), బెయిర్ స్టో (47) పవర్ ప్లే లో మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబయి జట్టు 228 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్, ప్రసిద్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.