HomeUncategorizedGST Reforms | జీఎస్టీ రిఫార్మ్స్‌ ఎఫెక్ట్‌..! ఏ టూవీలర్‌ రేటు ఎంత తగ్గిందంటే..

GST Reforms | జీఎస్టీ రిఫార్మ్స్‌ ఎఫెక్ట్‌..! ఏ టూవీలర్‌ రేటు ఎంత తగ్గిందంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో వాహనాల ధరలు దిగివస్తున్నాయి. నూతన శ్లాబ్‌లు ఈనెల 22 నుంచి అమలు కానుండగా.. చాలా కంపెనీలు ముందుగానే జీఎస్టీ తగ్గిస్తున్నాయి.

దేశంలో గతంలో జీఎస్టీలో నాలుగు శ్లాబ్‌లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను రద్దు చేసిన కేంద్రం.. 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లను కంటిన్యూ చేస్తోంది. లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం పన్ను వేయనుంది. అయితే వీటిపై ఇప్పటివరకు విధిస్తున్న 17 నుంచి 22 శాతం సెస్‌(Cess)ను రద్దు చేయడంతో లగ్జరీ ఉత్పత్తుల ధరలు సైతం 5 నుంచి 10 శాతం వరకు తగ్గుతున్నాయి. ఇక టూ వీలర్‌(Two Wheeler) రంగంలో 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న స్కూటర్లు, బైక్‌లపై జీఎస్టీని 28 శాతనుంచి 18 శాతానికి తగ్గించింది. అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న టూవీలర్లపై 40 శాతం జీఎస్టీ విధిస్తోంది. దీని ప్రకారం అన్ని వాహనాల ధరలు 5 శాతంనుంచి 10 శాతం వరకు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఇప్పటికే ఏ మోడల్‌ ధర ఎంత తగ్గుతుందో ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే జీఎస్టీ తగ్గించి వాహనాల బుకింగ్స్‌ తీసుకుంటున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఏ కంపెనీ మోడల్‌ ధర ఎంత తగ్గిందో తెలుసుకుందామా..

బజాజ్‌(Bajaj) టూవీలర్‌ ధరలు ఏ మేరకు తగ్గనున్నాయంటే..
ప్లాటినా100 : రూ. 5,508.
పల్సర్‌125 : రూ. 7,384.
పల్సర్‌ ఎన్‌ఎస్‌125 : రూ. 8,316.
పల్సర్‌150 : రూ. 9,417.
పల్సర్‌ ఎన్‌160 : రూ. 10,687.
పల్సర్‌ 220ఎఫ్‌ : రూ. 10,754.
పల్సర్‌ ఎన్‌250 : రూ. 11,267.

హీరో మోటార్స్‌(Hero motors) టూవీలర్స్..
హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ : రూ. 5,625.
స్పెండర్‌ ప్లస్‌ : రూ. 6,360.
హీరో గ్లామర్‌ : రూ. 7,182.
హీరో ఎక్స్‌ ట్రీమ్‌ 125ఆర్‌ : రూ. 7,852.

యమహా మోటార్స్‌(Yamaha motors) టూవీలర్స్..
రే జెడ్‌ఆర్‌ : రూ. 7,759.
ఫ్యాసినో : రూ. 8,509.
ఎఫ్‌ జెడ్‌ ఎక్స్‌ హైబ్రిడ్‌ : రూ. 12,430.
యమహా ఆర్‌15 : రూ. 17,581.

టీవీఎస్‌(TVS) టూవీలర్స్..
స్పోర్ట్‌ : రూ. 4,803.
ఎక్స్‌ఎల్‌ 100 : రూ. 5,022.
స్టార్‌ సిటీ ప్లస్‌ : రూ. 6,304.
రేడియన్‌ : రూ. 6,628.
జూపిటర్‌ 110 : రూ. 7,269.
జూపిటర్‌ 125 : రూ. 7,355.
రైడర్‌ 125 : రూ. 8,085.
ఎన్టార్క్‌ 125 : రూ. 8,530
రోనిన్‌ : రూ. 13,533.

హోండా(Honda) టూవీలర్స్..
హోండా షైన్‌ 125 : రూ. 7,443.
యాక్టివా 100 : రూ. 7,874.
యాక్టివా 125 : రూ. 8,259.
ఎస్‌పి 125 : రూ. 8,447.
హోండా ఎన్‌ఎక్స్‌ 200 : రూ. 13,250.
హోండా సిబి300ఎఫ్‌ : రూ. 13,281.
హోండా సిబి 350ఆర్‌ఎస్‌ : రూ. 17,078.
హోండా సిబి350 : రూ. 17,106.