ePaper
More
    HomeజాతీయంGST | జీఎస్టీ హేతుబద్ధీకరణ చారిత్రక నిర్ణయం.. కాంగ్రెస్ పాలనలో అన్నింటిపైనా పన్నులు వేశారని మోదీ...

    GST | జీఎస్టీ హేతుబద్ధీకరణ చారిత్రక నిర్ణయం.. కాంగ్రెస్ పాలనలో అన్నింటిపైనా పన్నులు వేశారని మోదీ ధ్వజం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: GST | వస్తువులు, సేవల పన్నులో సంస్కరణలు దేశస్వాతంత్య్ర అనంతరం అతిపెద్ద తీసుకున్న నిర్ణయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. సర్వశక్తిమంతమైన వస్తువులు సేవల పన్ను (GST) మండలి ఆమోదించిన విస్తృత శ్రేణి సంస్కరణలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

    గురువారం ఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్లో జాతీయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులతో ముచ్చటించిన ప్రధానమంత్రి.. జీఎస్టీ సరళంగా మారిందని, దీపావళికి ముందు సంస్కరణలను ‘డబుల్ ధమ్కా’ అని అభివర్ణించారు. రోజువారీ నిత్యావసరాలు, ఆహారం, ఔషధాలపై పన్నులు విధించిన కాంగ్రెస్ పార్టీ (Congress party) జీఎస్టీ హేతుబద్ధీకరణను విమర్శించిందని మండిపడ్డారు. తాను 2014లో రాకముందు, అది వంటగది పాత్రలు లేదా వ్యవసాయ వస్తువులు, మందులు, జీవిత బీమా (life insurance) సహా అన్నింటిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం వేర్వేరు పన్నులు విధించిందన్నారు.

    GST | డబుల్ డోస్..

    జీఎస్టీ సంస్కరణలు దేశానికి మద్దతు ఇవ్వడంతో పాటు వృద్ధికి ‘డబుల్ డోస్’ ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాజా నిర్ణయాలు సరళమైన పన్ను వ్యవస్థ, జీవన నాణ్యతను మెరుగుపరచడం, వినియోగం మరియు వృద్ధిని పెంచడం, వ్యాపారం చేయడంలో సౌలభ్యం, సహకార సమాఖ్యవాదం అనే ఐదు రత్నాలను (పంచ రత్న) భారత ఆర్థిక వ్యవస్థకు జోడించాయన్నారు. కాలానికి అనుగుణంగా సంస్కరణలు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు.

    “సకాలంలో మార్పులు లేకుండా, నేటి ప్రపంచ పరిస్థితిలో మన దేశానికి సరైన స్థానాన్ని ఇవ్వలేము. భారతదేశాన్ని స్వావలంబన చేయడానికి తదుపరి తరం సంస్కరణలను చేపట్టడం చాలా కీలకమని నేను ఆగస్టు 15న ఎర్రకోట (Red Fort) నుంచి చెప్పాను. ఈ దీపావళి, ఛత్ పూజకు ముందు దేశ ప్రజలకు రెట్టింపు ఆనందం కలుగుతుందని నేను హామీ ఇచ్చాను” అని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు GST మరింత సరళంగా మారిందని, దసరా నవరాత్రుల్లో (Dussehra Navratri) మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22న కొత్త తరం సంస్కరణలు అమలులోకి వస్తున్నాయని చెప్పారు.

    GST | కాంగ్రెస్ విమర్శలపై విసుర్లు..

    జీఎస్టీ సంస్కరణలపై (GST reforms) విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ వైఖరిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజువారీ నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు చివరకు చిన్న పిల్లలు తినే టోఫీలతో సహా ప్రతిదానిపైనా పన్ను విధించిందని గుర్తు చేశారు. ఆ విధానం కొనసాగి ఉంటే ప్రజలు రూ.100కి ఏదైనా కొనుగోలు చేస్తే రూ.20-25 పన్ను చెల్లించి ఉండేవారన్నారు. అయితే, ప్రజల పొదుపును పెంచడం, వారి జీవితాలను మెరుగుపరచడం తన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. “ఎనిమిది సంవత్సరాల క్రితం జీఎస్టీ అమలు ప్రారంభించినప్పుడు, అనేక దశాబ్దాల కల నిజమైంది.

    మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చర్చ ప్రారంభం కాలేదు. ఈ చర్చలు గతంలో కూడా జరిగేవి, కానీ ఎటువంటి పని జరగలేదు” అని కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పాలనలో టూత్ పేస్ట్, సబ్బు, హెయిర్ ఆయిల్ వంటివాటిపై 27% పన్ను. ఆహార ప్లేట్లు, కప్పు ప్లేట్లు, స్పూన్లపై 18 నుంచి 28 శాతం పన్ను. టూత్ పౌడర్ పై 17% పన్ను.. చివరకు పిల్లల టోఫీలపై 21% పన్ను తీసుకునేవారని మండిపడ్డారు. లక్షలాది మంది తల్లులు, సోదరీమణులకు (mothers and sister) ఆత్మగౌరవం, స్వయం ఉపాధికి ఒక మార్గంగా భావించే కుట్టుమిషన్లపై 16 శాతం పన్ను విధించారన్నారు.

    More like this

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...

    Best Teacher Award | ఉత్తమ ఉపాధ్యాయుడిగా బోర్గా(పి) జెడ్పీహెచ్​ఎస్​ హెచ్​ఎం శంకర్​

    అక్షరటుడే, ఇందూరు: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ...