- Advertisement -
HomeUncategorizedGST | రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

GST | రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | జీఎస్టీ gst వసూళ్లలో రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ aprilలో రూ.2.37 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం తెలిపింది. గతేడాది ఇది రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది. జీఎస్టీ చరిత్రలోనే ఈ ఏడాది ఏప్రిల్​లో అత్యధికంగా జీఎస్టీ వసూలు కావడం గమనార్హం. కాగా మార్చి marchలో జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

దేశంలో 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. తొలి నెల రూ.92వేల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. తర్వాత మెళ్లిగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు కోవిడ్​ సమయంలో తగ్గిపోయాయి. మళ్లీ 2022 ఏప్రిల్‌లో రూ.1.67 లక్షల కోట్లకు పెరిగాయి. తొలిసారి 2024 ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మార్కు దాటగా, ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు అయింది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News