Homeబిజినెస్​Stock Market | జీఎస్టీ ఊతం.. లాభాల్లో సూచీలు

Stock Market | జీఎస్టీ ఊతం.. లాభాల్లో సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic Stock Markets)కు జీఎస్టీ సంస్కరణలు ఊతమిచ్చాయి. దీంతో ప్రధాన సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే యూఎస్‌ సుంకాల భయంతో ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌(Profit Booking)కు దిగడంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.

గురువారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 889 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అయితే గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ప్రారంభ లాభాలు ఆవిరై ఇంట్రాడే గరిష్టాలనుంచి 580 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 265 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా క్రమంగా 181 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 434 పాయింట్ల లాభంతో 81,001 వద్ద, నిఫ్టీ(Nifty) 118 పాయింట్ల లాభంతో 24,834 వద్ద కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. చైనా స్టాక్స్‌ సెల్లాఫ్‌కు గురవుతున్నాయి. యూఎస్‌ జాబ్‌ డాటా బలహీనంగా రావడంతో యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించే విషయంలో వెనుకంజ వేయవచ్చన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశంలో అనుకూల వాతావరణం ఉన్నా.. మన మార్కెట్లు సైతం ఒత్తిడికి గురవుతున్నాయి.

మిక్స్‌డ్‌గా సూచీలు..

జీఎస్టీ సంస్కరణలతో ఆటో(Auto), ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు రాణిస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 1.53 శాతం, ఎఫ్‌ఎంసీజీ(FMCG) 0.70 శాతం, ఫినాన్షియల్‌ సర్వీసెస్‌ 0.45 శాతం, కన్జూమర్‌ గూడ్స్‌ 0.38 శాతం, బ్యాంకెక్స్‌ 0.28 శాతం లాభాలతో ఉన్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.64 శాతం, పీఎస్‌యూ, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 0.56 శాతం, ఇన్‌ఫ్రా 0.49 శాతం, ఐటీ 0.47 శాతం, ఎనర్జీ ఇండెక్స్‌ 0.45 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.37 శాతం లాభంతో ఉండగా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.12 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.08 శాతం నష్టంతో ఉన్నాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో ఉండగా.. 14 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఎంఅండ్‌ఎం 6.68 శాతం, బజాజ్‌ఫైనాన్స్‌ 4.52 శాతం, ట్రెంట్‌ 2.54 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.41 శాతం, ఐటీసీ 1.03 శాతం లాభంతో ఉన్నాయి.

Top Losers : సన్‌ ఫార్మా 1.11 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.93 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 0.90 శాతం, మారుతి 0.83 శాతం, బీఈఎల్‌ 0.82 శాతం నష్టంతో ఉన్నాయి.

Must Read
Related News