అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ (జీఎస్సీ) టాక్స్ సవరణ బిల్లు (GST Amendment Bill) సామాన్య ప్రజల వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan) అన్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రవేశపెట్టిన తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) సవరణ బిల్లుపై ఎమ్మెల్యే మాట్లాడారు.
Yellareddy MLA | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025 సెప్టెంబర్లో తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల తెలంగాణకు ఆర్థికనష్టం చేకూరుతుందని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సవరణ బిల్లు ద్వారా వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆదాయ మార్గాలను మెరుగుపరుస్తూనే ప్రజలపై భారం పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు.