అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | నగరంలోని ఆర్మూర్ రోడ్లో ఉన్న శ్రీరామగార్డెన్స్‌లో (Sri rama Gardern) ఈనెల 21న సామూహిక యోగా సాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు సోమవారం యోగా దినోత్సవ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 6.55 గంటల నుంచి 8.30 గంటల వరకు సామూహిక యోగా సాధన ఉంటుందన్నారు. జిల్లాలోని యువజన సంఘాలు (Youth organizations), మహిళా మండళ్లు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు, క్రీడాకారులు, అన్నివర్గాలవారు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ విభాగం నోడల్ అధికారి జె.గంగాదాసు, వైద్యులు తిరుపతి, వెంకటేష్, డీపీఎం వందన, ఫార్మసిస్ట్ పురుషోత్తం, భిక్షపతి, సిబ్బంది పాల్గొన్నారు.
