అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. చందూర్ (Chandur) మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) హాజరయ్యారు.
అయితే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని (Ex MLA Enugu Ravinder Reddy) పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా పోచారం వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వారి మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను సముదాయించారు. గతంలోనూ పలుమార్లు ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన సందర్భాలున్నాయని.. ఈ ఘటనలు స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయని పలువురు చర్చించుకున్నారు.