3
అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేయించారు.
అనంతరం ఉపాధ్యాయుడు కిషన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరించారు. దేశ భవిష్యత్ విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, విధులను ఉపయోగించుకొని దేశ పురోభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవన్న, రవీందర్, శ్రీనివాస్ రంగాచారి, శ్రావణి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.