అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST Reforms | జీఎస్టీలో సంస్కరణలు తీసుకు వస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పన్నుల శ్లాబ్‌లను తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో మంత్రుల బృందం(Ministers Group) తాజాగా 12 శాతం, 28 శాతం స్లాబ్ పన్ను శ్లాబ్‌లను తొలగించడానికి ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం జీఎస్టీలో భాగంగా 5శాతం, 12, 18, 28 శాతం పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. వీటిలో 12శాతం, 28శాతం స్లాబ్‌లను తొలగించాలని కేంద్రం యోచిస్తోంది. చాలా వరకు నిత్యవసర సరుకులు 12 శాతం పరిధిలో ఉన్నాయి. ఇవి 5శాతం పన్ను పరిధిలోకి రానుండటంతో ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. దీపావళికి కొత్త పన్నులను అమలు చేస్తామని ప్రధాని మోదీ(Prime Minister Modi) ఇదివరకే హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రుల బృందం తాజాగా రెండ్ స్లాబ్‌ల తొలగింపునకు ఆమోదం తెలిపింది.
GST Reforms | జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) వచ్చే నెలలో సమావేశం కానుంది. ప్రస్తుతం మంత్రుల బృందం ఆమోదించిన ప్రతిపాదనలపై ఆ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం దీపావళి తర్వాత కొత్త పన్ను విధానాలను అమలులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమాపై 18శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీనిని తొలగించాలని కొన్నాళ్లుగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రుల బృందం చర్చించినట్లు తెలిసింది. కాగా మంత్రుల బృందంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఉన్నారు.
GST Reforms | సామాన్యులకు మేలు
జీఎస్టీలో సంస్కరణలు(GST Reforms) తీసుకు వస్తే పేద, మధ్య తరగతి వారికి ఎంతో మేలు జరగనుంది. చాలా వరకు నిత్యవసర సరుకులపై ప్రస్తుతం 12శాతం జీఎస్టీ వేస్తున్నారు. సంస్కరణల్లో భాగంగా ఈ స్లాబ్ ఎత్తేసి వాటిని 5శాతం పన్ను పరిధిలోకి తేనున్నారు. దీంతో వస్తువుల ధరలు తగ్గుతాయి. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు 28శాతం జీఎస్టీ స్లాబ్‌లో ఉన్నాయి. అవి 18 శాతం పన్ను పరిధిలోకి రానున్నాయి. దీంతో వాటి ధరలు కూడా దిగి వచ్చే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.