60
అక్షరటుడే, వెబ్డెస్క్ : Group -3 Results | రాష్ట్రంలో గ్రూప్–3 ఫలితాలు (Group-3 results) వెలువడ్డాయి. టీజీపీఎస్సీ ఫలితాలను గురువారం రాత్రి విడుదల చేసింది.
హైదరాబాద్లోని (Hyderabad) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 30-12-2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్-3 సర్వీసుల నియామకం (జనరల్) కోసం తాత్కాలిక ఎంపిక నోటిఫికేషన్ను జారీ చేసింది. గ్రూప్ –3 పరీక్షలు గతేడాది నవంబర్లో జరిగాయి. ఈ ఏడాది మార్చి 14న అధికారులు ర్యాంకింగ్ జాబితా విడుదల చేశారు. దాని ఆధారంగా ప్రస్తుతం తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను ఇప్పుడు TGPSC వెబ్సైట్లో ఉంచింది. మొత్తం 1370 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. కోర్టులో ఉన్న కేసుల తీర్పునకు లోబడి తుది నియామకాలు ఉంటాయన్నారు.