అక్షరటుడే, ఇందూరు: Group–1 Job | ఇటీవల వెలువడిన గ్రూప్–1 ఫలితాల్లో నగరంలోని గంగాస్థాన్ ఫేజ్–2కు చెందిన దొనుపుల కిరణ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా (Assistant Audit Officer) ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి ఆడిట్ కార్యాలయంలో పోస్టింగ్ పొందారు.
ఈ మేరకు గంగాస్థాన్ ఫేజ్–2లోని (Gangasthan Phase-2) రాజారాణి అసోసియేషన్ (Rajarani Association) ఆధ్వర్యంలో శనివారం దొనుపుల కిరణ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, క్యాషియర్ ఎన్.గంగాధర్, ప్రధాన కార్యదర్శి చంటి రమేశ్ మాట్లాడుతూ.. తమ కాలనీకి చెందిన వ్యక్తి గ్రూప్–1లో ఉద్యోగం సాధించడం గర్వంగా భావిస్తున్నామన్నారు.
దొనుపుల కిరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు సాధించి కాలనీకి పేరు తేవాలని కోరుతున్నామన్నారు. ఆయన గ్రూప్–1లో ఉద్యోగం సాధించి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.