HomeతెలంగాణKavitha | గ్రూప్-1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలి : కవిత

Kavitha | గ్రూప్-1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలి : కవిత

గ్రూప్​–1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha | తెలంగాణలో గ్రూప్​–1 నియామకాలను (Group-1 Appointments) రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్​ చేశారు. గ్రూప్​–1 పిటిషన్​పై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు నేపథ్యంలో ఆమె ఓ వీడియో విడుదల చేశారు.

గ్రూప్​–1 పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్​ బెంచ్​ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీజీపీఎస్సీ డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించడంతో సింగిల్​ కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. తుది తీర్పు మేరకు నియామకాలు చేపట్టాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అభ్యర్థులను ఎంపిక చేసి నియామక పత్రాలు సైతం అందజేసింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిచడంపై స్టే ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

Kavitha | ప్రభుత్వం అనేక తప్పులు చేసింది

నిరుద్యోగులతో ప్రభుత్వం కొట్లాటకు దిగొద్దని కవిత సూచించారు. గ్రూప్-1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని ఆమె ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు. హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. దీంతో ఒకవేళ డివిజన్​ బెంచ్​ పరీక్షను రద్దు చేస్తే నియామక ప్రక్రియ అంతా వేస్ట్​ అవుతుందని కవిత​ అన్నారు. అభ్యర్థుల జీవితాలతో ఆడుకోకుండా పరీక్షను రద్దు చేసి మళ్లీ పెట్టాలని ఆమె డిమాండ్​ చేశారు.

Kavitha | జవాబు పత్రాలు డిస్పోజ్​ చేయొద్దు

గ్రూప్​–1 మెయిన్స్​ జవాబు పత్రాలను డిస్పోజ్​ చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. నియామకాల వివాదం న్యాయ స్థానాల్లో తేలేవరకు అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను డిస్పోజ్ చేయొద్దన్నారు. ఒకవేళ వాటిని ధ్వంసం చేస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ (TGPSC)ను స్తంభింపజేస్తామని ఆమె హెచ్చరించారు.