అక్షరటుడే, ఆర్మూర్ : Nandipet | నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమం ( Sri Kedareshwara Ashram)లో నిత్య అన్నదాన సత్రం నూతన భవనం నిర్మాణ పనులు చేపట్టారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంగి రాములు మహారాజ్ (Mangi Ramulu Maharaj) ఆధ్వర్యంలో దైవ కార్యక్రమాలతోపాటు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే, ఎంపీ నిధులు అందజేస్తామన్నారు. ధర్మ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు.
