అక్షరటుడే, న్యూఢిల్లీ: Grok Chatbot : గ్రోక్ చాట్ బాట్ Grok Chatbot సృష్టిస్తున్న అసభ్యకరమైన కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో ట్విట్టర్(X) కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న అసభ్యకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తీసుకున్న చర్యల గురించి 72 గంటల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Grok Chatbot : వివాదాలకు కేంద్ర బిందువు
సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో వినియోగిస్తున్న జనరేటివ్ ఏఐ టూల్ ‘గ్రోక్’ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ టూల్ విపరీతంగా దుర్వినియోగం అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల చిత్రాలను అసభ్యకరంగా మార్చడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
ఎక్స్ వేదికలోనే అంతర్భాగంగా ఉన్న ఈ ఏఐ టూల్ సిస్టమ్.. యూజర్ అడిగిన వెంటనే, నైతికత పాటించకుండా అసభ్యకరమైన చిత్రాలను సృష్టిస్తోంది. ఇది ఎక్స్ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.