ePaper
More
    HomeFeaturesTax Notice | కిరాణ దుకాణం యజమానికి రూ.141 కోట్ల ట్యాక్స్​ నోటీసు.. ఎందుకో తెలుసా?

    Tax Notice | కిరాణ దుకాణం యజమానికి రూ.141 కోట్ల ట్యాక్స్​ నోటీసు.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tax Notice | కిరాణ దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తికి రూ.141 కోట్లకు పైగా పన్ను నోటీస్​ వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​లో (Uttar Pradesh) చోటు చేసుకుంది.

    యూపీలోని బులంద్‌షహర్‌ ఏరియాలో సుధీర్​ అనే వ్యక్తి కిరాణ షాప్​ పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆయనకు రూ.141 కోట్లకుపైగా అమ్మకాలపై ఆదాయపు పన్ను అధికారులు నోటీస్​లు పంపారు. దీంతో ఆయన షాక్​ అయ్యాడు. ఎవరో ఆయన పాన్​ కార్డు ఉపయోగించి ఢిల్లీలో ఆరు కంపెనీలను నడుపుతున్నట్లు బాధితుడు గుర్తించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

    Tax Notice | గతంలోనూ..

    సుధీర్​ 2022లో సైతం జీఎస్టీ (GST) కార్యాలయం నుంచి నోటీస్​ అందింది. అయితే సదరు సంస్థతో తనకు సంబంధం లేదని అప్పుడే అధికారులకు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జులై 10న మళ్లీ రూ.141 కోట్ల అమ్మకాలు చేసినట్లు ఆయనకు నోటీస్​ వచ్చింది. అందులో ఆయన ఢిల్లీలో (Delhi) ఆరు కంపెనీలు నడుపుతున్నట్లు ఉండడంతో షాక్​ అయ్యాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    Tax Notice | ఇతరుల పాన్​కార్డులతో..

    కొందరు ఆర్థిక నేరగాళ్లు, సైబర్​ నేరస్తులు ఇతరుల పాన్​ కార్డులతో బ్యాంకు ఖాతాలు, డొల్ల కంపెనీలు తెరుస్తారని అధికారులు తెలిపారు. ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో (Kubera Movie) బిచ్చగాళ్ల పేరుతో అకౌంట్లు తీసి మనీలాండరింగ్​ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఆధార్​ కార్డు, పాన్​ కార్డుల సాయంతో కొందరు వ్యక్తులు షెల్​ కంపెనీలు తెరుస్తారని అధికారులు పేర్కొన్నారు. వీటితో రుణాలు పొందడం, పన్నులు ఎగవేయడం వంటి పనులు చేస్తారని చెప్పారు.

    Tax Notice | జాగ్రత్తగా ఉండాలి

    ప్రజలు గుర్తు తెలియని వ్యక్తులకు పాన్​, ఆధార్​ కార్డు జిరాక్స్​లు ఇవ్వొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే తమ క్రెడిట్​ నివేదికను అప్పుడప్పుడు చెక్​ చేసుకోవాలని సూచిస్తున్నారు. యూపీకి చెందిన ఓ పారిశుధ్య కార్మికుడికి ఇటీవల రూ.34 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు వచ్చాయి. పాన్​ కార్డు దుర్వినియోగంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

    Latest articles

    Prajavani | ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావొద్దు: కలెక్టర్​

    అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా...

    Heavy rains | భారీవర్షాలు కురిసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలి.. సబ్​ కలెక్టర్​ కిరణ్మయి

    అక్షరటుడే, బాన్సువాడ: Heavy rains | రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ...

    Earthquake | అఫ్గానిస్తాన్​లో భూకంపం.. 800కు చేరిన మృతుల సంఖ్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | అఫ్గానిస్తాన్లో (Afghanistan)​ భారీ భూకంపంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో...

    Vice President Elections | అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా : ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Elections | రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ...

    More like this