Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌

Nizamsagar Project | నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ పాండే సందర్శించారు. ‘స్వచ్ఛతా హీ సేవ తదితర కార్యక్రమాల్లో భాగంగా ప్రాజెక్ట్‌ పరిసరాలను పరిశీలించారు.

- Advertisement -

అక్షర టుడే, వెబ్‌డెస్క్: Nizamsagar Project | నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ పాండే (GRMB Chairman Pandey) శుక్రవారం సందర్శించారు. ‘స్వచ్ఛతా హీ సేవ’, ‘స్పెషల్‌ క్యాంపెయిన్‌ 5.0’ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్‌ పరిసరాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపు, తదితర అంశాలపై ప్రాజెక్టు అధికారులతో సమీక్షించారు.

ప్రాజెక్టు అధికారులు (project officials) నిర్వహిస్తున్న శుభ్రతా కార్యక్రమాలను ఆయన అభినందించారు. అలాగే అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు పరిధిలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో కనీసం ఒక మొక్క నాటి, దానిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్యులు (Godavari River Management Board members), స్థానిక అధికారులు పాల్గొన్నారు.