Homeలైఫ్​స్టైల్​Chennai | చెన్నైలో స్పెషాలిటీ ఇదే.. డెలివ‌రీ పార్డ్‌న‌ర్ల కోసం ఏసీ విశ్రాంతి కేంద్రాలు

Chennai | చెన్నైలో స్పెషాలిటీ ఇదే.. డెలివ‌రీ పార్డ్‌న‌ర్ల కోసం ఏసీ విశ్రాంతి కేంద్రాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chennai | ఫుడ్, ఇ-కామర్స్ (E commers) డెలివరీ సిబ్బంది తమ విధి నిర్వహణలో విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యంగా ఉండేలా నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఏసీ గదులు ఏర్పాటు చేసింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Online food delivery), ఈ-కామర్స్ వ్యాపారం విస్తరించడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో సామగ్రిని కస్టమర్లకు సురక్షితంగా.. వేగంగా అనుకున్న సయమానికి అందించడానికి ఎక్కువ ఒత్తిడిలో పని చేయాల్సిన పరిస్థితి ఉంది. మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోడానికి కూడా టైమ్ ఉండదు. అయితే, ఫుడ్, ఇ-కామర్స్ సంస్థలో పనిచేసే డెలివరీ సిబ్బంది కోసం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్(Chennai Municipal Corporation) శుభవార్త చెప్పింది.

Chennai | గొప్ప నిర్ణ‌యం..

పని మధ్యలో వారు అలిసిపోకుండా ఉండేందుకు నగరంలోని ముఖ్యమైన రహదారుల వెంబడి ఏసీ గదులు(AC Rooms) ఏర్పాటు చేయాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) GCC నిర్ణయించింది. ఈ క్ర‌మంలో చెన్నైలో డెలివ‌రీ పార్డ్‌న‌ర్ల కోసం ఏసీ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. ఇందులో డెలివరీ బాయ్స్‌(Delivery boys)కు విశ్రాంతి తీసుకునేందుకు, తినేందుకు, మొబైల్‌ ఛార్జ్‌(Mobile charge) చేసుకునేందుకు, టాయిలెట్‌ వాడుకునేందుకు సౌకర్యాలను అందిస్తున్నాయి. ఇలాంటి వ‌స‌తి కేంద్రాలు దేశంలో తొలిసారిగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ‌మే క‌ల్పించింది.

చెన్నై (Chennai) మహానగరంలో ఫుడ్, ఇ-కామర్స్ డెలివరీ సిబ్బంది సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులకు తక్కువ సమయంలో సేవలు అందించేందుకు వీరు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ రంగంలో దాదాపు 10% మంది మహిళా కార్మికులుగా ఉన్నారని అంచనా. కానీ, వీరికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవన్న ఆరోపణలున్నాయి. పని మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి తగిన వసతుల్లేవు. ముఖ్యంగా అన్నాసాలై రెండో అవెన్యూ(Annasalai Second Avenue), ఖాదర్ నవాజ్‌ఖాన్ రోడ్, ఉత్తమర్ గాంధీ రోడ్, రాయపేట హై రోడ్ వంటి ప్రాంతాలు డెలివరీ సిబ్బందికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. వర్షాకాలం, ఎండాకాలంలో వీరి పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత సున్నితంగా ఉండడంతో వీరికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మహానగర చెన్నై కార్పొరేషన్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంద‌ని టాక్ వినిపిస్తోంది.