అక్షరటుడే, బోధన్: Summer Camp | పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్(Summer Camp)కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 10వ తేదీన క్యాంప్ ప్రారంభం కాగా.. రెండురోజుల్లోనే 60 మంది చిన్నారులు చేరారు. వారికి యోగా, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, కరాటే, రాత తదితర అంశాల్లో శిక్షణనిస్తున్నామని ఎంఈవో నాగయ్య పేర్కొన్నారు. చిన్నారులకు స్నాక్స్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.