అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Viral Video | ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను రీల్స్ రూపంలో చూపిస్తూ సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేస్తున్నారు. దీంతో కొందరు ఒక్క రాత్రిలోనే స్టార్‌లుగా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రోజూ వేలాదిగా రీల్స్ అప్‌లోడ్ అవుతుంటాయి, వాటిలో కొన్ని మాత్రం నెటిజన్లను వెంటనే ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తన హల్దీ వేడుక (Haldi Ceremony)లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చేసిన డ్యాన్స్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. “ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా” పాటకి అదిరిపోయే స్టెప్పులతో అందరు ఫిదా అయ్యేలా చేశారు.
Viral Video | హీరోని మించేలా..
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వరుడితో పాటు పక్కన వాళ్లు కూడా మంచి గ్రేస్‌తో డ్యాన్స్ చేశారని, ఎవర్ గ్రీన్ వీడియో ఇది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన ‘ఆయుధం’ సినిమాలోనిది ఈ పాట. ఇటీవల ఈ సాంగ్‌ను రీక్రియేట్ చేయగా, కిరణ్ అబ్బవరం తన మాస్ స్టెప్పులతో తెరపై ఉర్రూతలూగించాడు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఆయుధం సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా.. చిన్న చరణ్ లిరిక్స్ అందించారు. కుమార్ సాను, నిష్మా ఆలపించగా, ఈ పాటలో రాజశేఖర్ తో పాటు హీరోయిన్ గుర్లీన్ చోప్రా కథానాయికగా నటించింది. ఎన్. శంకర్ దర్శకత్వం వహించారు.
కే ర్యాంప్ కోసం ఇదే పాటని రీ క్రియేట్ చేయగా, ఈ పాట వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేయగా, కేవలం కొన్ని గంటల్లోనే అది ట్రెండింగ్‌లోకి దూసుకుపోయింది. ఒరిజినల్ వెర్షన్ కూడా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే చాలా మంది ఆ పాటని రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా సంగీత్ వేడులలో, హల్దీ ఫంక్షన్స్‌లో ఇలాంటి పాటలకి చిందులేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లోకి రావడంతో పాటు కుర్రాడి వీడియో కూడా వైరల్ అయింది.
View this post on Instagram

