6
అక్షరటుడే,నిజాంసాగర్: Nijam Sagar | మండలంలోని అచ్చంపేటలో (Achampeta) రేణుక ఎల్లమ్మ తల్లి జాతర (Renuka Yellamma’s Talli Jathara) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం భజన కీర్తనలు, 6న ఎడ్లబండ్ల ప్రదర్శన, బోనాలు, భాగవత కార్యక్రమాలు, 7న కుస్తీ పోటీలు(Wrestling competitions), రథోత్సవం ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు బంగ్లా ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.