అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | వేల్పూర్ మండలం (Velpur mandal) పచ్చలనడ్కుడ గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముదిరాజ్ సంఘం (Mudiraj community) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిపించారు.
Bheemgal | ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనదేవత పెద్దమ్మతల్లి మూడో ఆలయ (Peddamma Thalli temple) వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి పూజ, చక్రతీర్థం, పుష్పయాగం, బలిహరణం, చండీయాగం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి బోనాల సమర్పణ ఊరేగింపు నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం, ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు పాల్గొన్నారు.