అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామంలో (Chinna Rampur village) నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ స్థిర ప్రతిష్ఠాపన నిర్వహించారు. ఎస్‌డీఎఫ్ నిధులతో నిర్మించిన ఆలయంలో సోమవారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమం, యజ్ఞంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి (MLA Pocharam Srinivasa Reddy), ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు (Kasula Balaraju) పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు అందిస్తుందని, గ్రామస్థులు భక్తి మార్గంలో పయనించాలని పోచారం సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజయ్య, మోహన్ రెడ్డి, గణేష్, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
