అక్షరటుడే, ఇందూరు : Jenda Jathara | నగరంలోని జెండా బాలజీ (Jenda Balaji) ఆలయంలో 15 రోజులుగా కొనసాగిన జాతర ఆదివారం ముగిసింది.
వంశపారంపర్య అర్చకులు అజయ్ సంగ్వాయి, సంజయ్ సంగ్వాయి, విజయ్ సంగ్వాయ్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభాయాత్రగా పూలాంగ్ సమీపంలోకి తరలించడం ఆనవాయితీ. కాగా ఈ సారి చంద్రగ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాను ఊరేగించారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ మీదుగా జెండాను తీసుకెళ్లి పూలాంగ్ బ్రిడ్జి సమీపంలో ప్రతిష్ఠించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో దర్శనానికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal), ఆలయ ఛైర్మన్ ప్రమోద్, ఈవో వేణు పాల్గొన్నారు.

Jenda Jathara | దర్శించుకున్న పీసీసీ అధ్యక్షుడు
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Goud) జెండా జాతరలో పాల్గొన్నారు. బాలాజీ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండాను దర్శించుకున్నారు. సంప్రదాయంగా వస్తున్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు.
