అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Munnuru Kapu Sangham | పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మున్నూరు కాపు సర్పంచ్‌లను (Munnuru Kapu Sarpanches) జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) పేర్కొన్నారు. నగరంలోని జిల్లా మున్నూరు కాపుసంఘంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో వచ్చే నెల 11న ఆదివారం ఉదయం 12 గంటలకు సన్మాన కార్యక్రమం ఉంటుందని సంజయ్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు కులానికి చెందిన అభ్యర్థులు అధికసంఖ్యలో గెలుపొంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.
Munnuru Kapu Sangham | జిల్లాలో 67మంది సర్పంచ్‌లు..
జిల్లాలో 67 మంది మున్నూరు కాపు సర్పంచ్‌లు విజయం సాధించారని సంజయ్ తెలిపారు. అలగే 60 మంది ఉప సర్పంచ్‌లుగా, వందలాది మంది వార్డు మెంబర్లుగా గెలిచారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వీరందరికి ఘన సత్కారం చేసి గౌరవించాలని జిల్లా మున్నూరు కాపు సంఘం భావిస్తుందని ఆయన వెల్లడించారు. మున్నూరు కాపుల ఐక్యత, అభ్యున్నతే ప్రథమ కర్తవ్యంగా భావించి తన తండ్రి దివంగత ధర్మపురి శ్రీనివాస్ కృషి చేశారని సంజయ్ వెల్లడించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తానని హామీఇచ్చారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఆకుల రమేష్, బంటు బాలవర్ధి, ప్రధాన కార్యదర్శి దారం సాయిలు, ఆకుల చిన్న రాజేశ్వర్, ఆకుల రాఘవేందర్, బంటు బలరాం, కౌడపు శరత్, గాండ్ల లింగం, సిర్ప నాగన్న, రామర్తి గంగాధర్, ఆది శ్రీనివాస్, రెంజర్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.