GG College
GG College | జీజీ కళాశాలలో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..

అక్షరటుడే, ఇందూరు: GG College | యూజీసీ, నెట్, జేఆర్ఎఫ్ వంటి ఫెలోషిప్ సాధిస్తే భవిష్యత్తు గొప్పగా మార్చుకోవచ్చని గిరిరాజ్ డిగ్రీ కళాశాల (Giriraj Degree College) ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాం మోహన్ రెడ్డి అన్నారు. ఎంఏ ఇంగ్లిష్​ కోర్సు (MA English course) పూర్తి చేసుకున్న విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని సూచించారు. సాహిత్యం అధ్యయనం చేసిన విద్యార్థులు రచనలు చేయాలన్నారు. పీజీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన గంగోత్రి పూజా గుప్తా, సాయిరాంలను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగారత్నం ఆంగ్ల విభాగం అధిపతి డాక్టర్ దండు స్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ నహీదా బేగం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామ్ కిషన్, ఎన్​సీసీ అధికారి డాక్టర్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.