అక్షరటుడే, భీమ్గల్: Devi immersion procession | నిజామాబాద్ NIZAMABAD జిల్లా భీమ్గల్ Bheemgal పట్టణంతో పాటు మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో శుక్రవారం (అక్టోబరు 3) అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర చేపట్టారు.
ఈ వేడుకను ఇంద్రకీలాద్రి Indrakiladri ఉత్సవ కమిటీ, మున్నూరు కాపు సంఘాల శ్రీ శర్వాణి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Devi immersion procession | బాల్కొండ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
శర్వాణి ఉత్సవ కమిటీ దుర్గాదేవి శోభయాత్రలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులతో పాటు, శోభాయాత్రలో పాల్గొన్నారు.
దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో కళాకారులు, పోతరాజుల నృత్యాలు, విన్యాసాలు, చిన్నారుల దాండియా నృత్యాలు అలరించాయి.

సంప్రదాయక గొడుగులు, భక్తి పాటలతో ఆకట్టుకున్నారు. డప్పు చప్పులు, మంగళ వాయిద్యాలతో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీశారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో దుర్గామాతకు నీరాజనం పలికారు.
అర్చకులు నంబి వాసుదేవ చార్యులు, రాకేష్ శర్మ, నంబి ప్రణీత్, ఇంద్రకీలాద్రి ఉత్సవ కమిటీ, శర్వాణి ఉత్సవ కమిటీ సభ్యులు, మూడు గైండ్ల మున్నూరు కాపు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
