అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో మల్లికార్జున స్వామి ఆలయ (Sri Mallikarjuna Swamy temple) ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయం వద్ద అగ్నిగుండం ఏర్పాటు చేశారు. భక్తులు అధికసంఖ్యలో గుండంలో నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి అఖండ దీపారాధన, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యహవచనం నిర్వహించారు.
Kamareddy | తరలివచ్చిన భక్తులు
మేడాలమ్మ గొల్ల కేతమ్మ-శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు (devotees) అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించి పరవశించిపోయారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులు స్వామివారికి ఓడిబియ్యం సమర్పించనున్నారు. సాయంత్రం ఎడ్ల బండ్ల ఊరేగింపు ఉంటుంది.
