Homeజిల్లాలుకామారెడ్డిBhiknoor | ఘనంగా బోనాల ఊరేగింపు

Bhiknoor | ఘనంగా బోనాల ఊరేగింపు

- Advertisement -

అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | ఆషాఢమాసం ప్రారంభం కావడంతో ప్రజలు బోనాల పండుగలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్​లో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు జరుపుకుంటున్నారు.

ఇందులో భాగంగా భిక్కనూరులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహంకాళి అమ్మవారు, భూలక్ష్మి అమ్మవార్లకు మహిళలు బోనాలను సమర్పించారు. భాజా భజంత్రీలతో డీజేలతో బోనాల ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరుకాపుసంఘం కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News