75
అక్షరటుడే, ఆర్మూర్: Alumni Reunion | పట్టణంలోని నరేంద్ర హైస్కూల్ (Narendra High School) 1998-99 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో (private hotel) ఈ కార్యక్రమం జరిపారు.
Alumni Reunion | పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని..
ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్నతనంలో విద్యనేర్పిన గురువులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆనాటి పాఠశాల ఉపాధ్యాయులు భీమ్గల్ ఎంఈవో స్వామి, ఉపాధ్యాయులు పురుషోత్తమ చారి, కిషన్, చక్రధర్, రాజేశ్వర్, పోషన్న, భూమేశ్వర్, సుభాష్, ప్రకాష్, రాజేందర్, రవి, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.